LOADING...
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్  
రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్ ఆదేశాలు

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్  

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బిగ్ షాక్ ఇచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై విచారణ జరపాలని కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ విచారణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్యెల్యే కోర్టు గత జనవరి 28న తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ తెలిపారు.

వివరాలు

నిర్ణయం తీసుకొనే అధికారం తమకు లేదు

తన పిటిషన్‌పై తాజా తీర్పు వెలువడినట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు కింది కోర్టు పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని పేర్కొంటూ కేసును తిరస్కరించింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

Advertisement