
Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
క్వార్ట్జ్ తవ్వకాలపై నందనూరు మండలం పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విషయంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని, అదేవిధంగా తన అరెస్టును నిలిపివేయాలని కోరుతూ కాకాణి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ఈ కేసు ఫిబ్రవరిలో నమోదైందిగా సమాచారం. ఇందులో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు, రవాణా, పేలుడు పదార్థాల వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలున్నాయి.
Details
ఏ4గా కాకాణి
ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. విచారణకు హాజరుకావాలని మూడు సార్లు నోటీసులు జారీ చేసినా, ఆయన వాటిని పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామంగా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించడంతో కేసు దర్యాప్తులో కీలక మలుపు ఏర్పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.