
Bihar: మూడు విడతల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) వేగంగా చర్యలు తీసుకొంటోంది ఛట్‌పూజ వేడుకలు ముగిసిన తరువాతే పోలింగ్ జరగనుందని అంతర్జాతీయ పత్రికల కథనాలు సూచిస్తున్నాయి. నవంబర్ 22వ తేదీతో బిహార్ (Bihar) అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఆ లోపే ఈ ఎన్నిక జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇండియాటుడే కథనం వెలువరించింది.
వివరాలు
2015లో ఐదు విడతల్లో ఎన్నికలు
ఈ ఎన్నికలు మూడు విడతల్లో నవంబర్ 5 నుండి 15 వరకు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ గడువు ముగియగానే కొత్త సభ్యులను ఎంచుకునే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో, 2020లో కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లోనే జరిగాయి. అప్పుడు 71 సీట్లకు అక్టోబర్ 28న, 94 స్థానాలకు నవంబర్ 3న, మిగిలిన 78 నియోజకవర్గాల్లో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. మరికొంత వెనుక వెళితే, 2015లో ఈ ఎన్నికలు ఐదు విడతల్లో జరిగాయి.