Loading...
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి విధించిన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే వారు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అక్టోబర్ 28న జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 2017లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు వారి నేర నిర్ధారణతో పాటు శిక్షను కూడా సమర్థించింది.

వివరాలు 

ఒక దోషికి తీవ్ర వైకల్యం ఉందన్న సుప్రీంకోర్టు

ఈ కేసులో ఇద్దరు దోషులు 17 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

వారిలో ఒకరికి తీవ్ర వైకల్యం ఉన్న విషయాన్ని కూడా పరిశీలించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. నిందితులు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని ధర్మాసనం పేర్కొంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వారికి బెయిల్ మంజూరు చేసింది.

వివరాలు 

దోషుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది లూథ్రా

దోషుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తన క్లయింట్లు 17 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు.

వారిలో ఒకరిని ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ కేసులో నిందితుడిగా చేర్చారని, ఎఫ్‌ఐఆర్‌లో కూడా అతడి పేరు లేదని పేర్కొన్నారు.

అయితే ప్రాసిక్యూషన్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజా ఠాక్రే వారి బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏడుగురి హత్య, సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో ఈ ఇద్దరు దోషులుగా తేలారు.

ఈ కేసులో మొత్తం 11 మందికి జీవిత ఖైదు విధించారు. అయితే 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ 11 మంది ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 జనవరిలో గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష ఉత్తర్వులను రద్దు చేసింది.

దీంతో దోషులు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ADVERTISEMENT