
Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికను విడుదల చేసింది.
విరాళాల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మిగతా పార్టీల కంటే ఎంతో ఎక్కువ మొత్తం విరాళాలు అందుకుంది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి బీజేపీకి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అధికంగా వచ్చాయని నివేదిక పేర్కొంది.
విరాళాల పరంగా రెండో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించగా, ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపధ్యంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలపై ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
వివరాలు
బీజేపీకి రూ.2,243 కోట్లు - అగ్రస్థానం దక్కించుకున్న కాషాయ పార్టీ
2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.2,243 కోట్లకు పైగా విరాళాలు అందాయి.జాతీయ రాజకీయ పార్టీలలో ఇది అత్యధిక మొత్తమే.
ఈ వివరాలు ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనబడ్డాయి.ఈ సమాచారం ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన డేటా ఆధారంగా తయారు చేయబడినది.
ముఖ్యంగా రూ.20,000 పైగా విరాళాల గురించిన సమాచారం ఈ గణాంకాల్లో ఉంది.ఇందులో భాగంగా, మొత్తం 12,547 మంది దాతల నుంచి రూ.2,544.28 కోట్లు విరాళంగా వచ్చాయి.
గత ఏడాది రూ.12.547 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈసారి గతంతో పోల్చుకుంటే దాదాపు 199 శాతం పెరుగుదల చోటుచేసుకుంది.
ఈ మొత్తంలో బీజేపీకి వచ్చిన విరాళాల వాటా 88 శాతం. మొత్తం 1,994మంది దాతలు బీజేపీకి రూ.2,243 కోట్ల రూపాయలను అందించారు.
వివరాలు
రెండో స్థానంలో కాంగ్రెస్
ఇది గత సంవత్సరం కంటే 211 శాతం అధికం.
బీజేపీ తర్వాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి రూ.281 కోట్ల విరాళాలు లభించాయి.
కాషాయ పార్టితో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెరుగుదల దృష్ట్యా ఇది గమనించదగ్గ విషయమే.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు రూ.79.924 కోట్లు మాత్రమే రావగా, 2023-24లో అది రూ.281.48 కోట్లకు చేరుకుంది. ఇది 252.18 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఇతర పార్టీలు
ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు తక్కువ మొత్తంలోనే విరాళాలను పొందినట్లు నివేదిక తెలిపింది.
మరోవైపు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రం గతంలాగే ఈసారి కూడా తమకు ఎలాంటి విరాళాలు అందలేదని స్పష్టం చేసింది.