Page Loader
'who's your father' : మమతా బెనర్జీపై బీజేపీ నేత వివాస్పద వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు
మమతా బెనర్జీపై బీజేపీ నేత వివాస్పద వ్యాఖ్యలు..

'who's your father' : మమతా బెనర్జీపై బీజేపీ నేత వివాస్పద వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి,బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ మంగళవారం వివాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్‌ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్‌ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మమతా గోవా వెళ్లి,'నేను గోవా కూతురిని'అని,త్రిపురలో,'నేను త్రిపుర కుమార్తెను'అనిఅంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి'అని ఘోష్‌ వ్యాఖ్యానించారు. ఘోష్‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అవుతున్నారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జరిగిన ఎన్నికల నినాదం'బంగ్లా నిజేర్ మేయేకీ చాయే'(బెంగాల్‌కు తన సొంత కూతురే కావాలి)బాగా పాపులర్ అయ్యింది. ఆ ఎన్నికల్లో తృణమూల్‌ ఘన విజయం సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిలీప్ గోష్ మాట్లాడిన వీడియో ఇదే ..