బీజేపీ ఎంపీ సుజనా చైదరికి కేంద్రం ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి కేంద్రం ఝలక్ ఇఛ్చింది. ఆయన యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కాలేజి గుర్తింపును రద్దు చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో సీట్లను భర్తీ చేయకూడదని ఆదేశించింది. సుజనా చౌదరికి చెందిన వైద్య కళాశాల మేడ్చల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లో ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్ 2002లో ఏర్పాటు చేశారు. ట్రస్టు రూపంలో కళాశాల యాజమాన్యం దీన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఎన్టీ రామరావు హెల్త్ యూనివర్శటీ ఆధీనంలో కొనసాగింది. రాష్ట్ర విజభన తర్వాత వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శటి పరిధిలోకి వచ్చింది.
మెడికల్ కళాశాల గుర్తింపును రద్దు చేసిన ఎంసీఐ!
ఈ మెడికల్ కళాశాలలో మొత్తంగా 150 సీట్లను భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 2002 నుంచి 2017 వరకు ప్రతి విద్యా సంవత్సరంలో 100 సీట్లను భర్తీ చేసుకోవడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపును రద్దు చేసినట్లు ఎంసీఐ ప్రకటించినట్లు సమాచారం. నేషనల్ కౌన్సిల్ యాక్ట్ 2019 లోని 26 క్లాజ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అడ్మిషన్లు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే దీనికి గల కారణాలు తెలియడం లేదు. ఈ మెడికల్ కళాశాల గుర్తింపు రద్దుతో తెలంగాణ 100 మెడికల్ సీట్లను కోల్పోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.