
JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. జూన్ 2024 వరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండనున్నారు.
అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు గత ఏడాది తీసుకున్న నిర్ణయానికి ఆదివారం బీజేపీ జాతీయ మండలి ఆమోదం తెలిపినట్లు పార్టీ ప్రకటించింది.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని మార్చేందుకు బీజేపీ నాయకత్వం నిరాకరించింది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది.
ఇదిలా ఉంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జేపీ నడ్డా అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఆయన్ను మార్చేందుకు పార్లమెంటరీ బోర్డు విముఖత చూపడానికి మరో కారణంగా తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూన్ 2024 వరకు నడ్డానే అధ్యక్షుడు
JP Nadda's tenure extended. He will continue as National President of BJP till June 2024. pic.twitter.com/4xopBCy0C4
— News Arena India (@NewsArenaIndia) February 18, 2024