Loading...
Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే
ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే

Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది. గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా అధిక సంఖ్యలో రైతులు ఈ రకం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వెనామీ రొయ్యల సాగులో పెరుగుతున్న సమస్యలు,ఉత్పత్తి వ్యయం అధికం కావడం,ధరలు తగ్గడం వంటి పరిణామాలు రైతులను తిరిగి బ్లాక్ టైగర్ వైపు మళ్లిస్తున్నాయి. దేశంలో 1985 నుంచే బ్లాక్ టైగర్ రొయ్యల సాగు విస్తృతంగా ప్రారంభమైంది. అప్పట్లో దాదాపు ప్రతి రొయ్యల చెరువులో ఇదే రకం సాగు చేసేవారు. అయితే 1994లో వైట్‌స్పాట్ వైరస్ తీవ్రంగా వ్యాపించి రైతులకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

వివరాలు 

క్కువ కాలంలోనే విస్తృతంగా సాగులోకి వచ్చిన వెనామీ రొయ్యలు

అదే సమయంలో యాంటీబయాటిక్స్ వినియోగంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆంక్షలు రావడంతో ఎగుమతులు కూడా ప్రభావితమయ్యాయి.

పరిస్థితి తీవ్రతరమవడంతో అప్పట్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది.

అనంతరం విదేశీ రకమైన వెనామీ రొయ్యలు రాష్ట్రంలోకి ప్రవేశించి తక్కువ కాలంలోనే విస్తృతంగా సాగులోకి వచ్చాయి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెనామీ రొయ్యల ఉత్పత్తి 13.04 లక్షల టన్నులకు చేరగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 11.57 లక్షల టన్నులుగా నమోదైంది.

అయితే ఇటీవల వెనామీ రొయ్యల్లో వ్యాధుల ప్రభావం పెరగడం, మేత ధరలు పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయం అధికమవడం, అమెరికా విధించిన సుంకాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం వంటి కారణాలతో రైతులు మళ్లీ బ్లాక్ టైగర్ సాగును ఆశ్రయిస్తున్నారు.

వివరాలు 

విదేశీ మార్కెట్లకు క్రమంగా పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులు

దీని ఫలితంగా దేశంలో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు గణనీయంగా పెరిగింది. 2021-22తో పోలిస్తే ఈ రకం సాగు విస్తీర్ణం 71 శాతం వృద్ధి చెందింది.

విదేశీ మార్కెట్లకు బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతుండటం రైతుల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు 32,201 ఎకరాల్లో జరుగుతోంది.

ఉప్పునీటి రొయ్యల మొత్తం సాగులో దీని వాటా 23.5 శాతంగా ఉంది. ఈ రకం ద్వారా సుమారు 60 వేల టన్నుల ఉత్పత్తి లభిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

విదేశీ మార్కెట్లకు క్రమంగా పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులు

రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు అత్యధికంగా ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా కొంత మేర ఈ రకం సాగు కొనసాగుతోంది.

వెనామీ సాగులో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో రానున్న రోజుల్లో బ్లాక్ టైగర్ సాగు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఆక్వా రంగ నిపుణులు భావిస్తున్నారు.

ADVERTISEMENT