Page Loader
అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు 
అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు

అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు 

వ్రాసిన వారు Stalin
Apr 24, 2023
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం అడుగుపెట్టిన పోలీసులు ఖంగుతిన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని చాకియా ప్రాంతంలోని పాక్షికంగా కూల్చేసిన అతిక్ అహ్మద్‌ఆఫీస్‌లో పోలీసులకు రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. తెల్లటి గుడ్డ ముక్కపై, మెట్లపై రక్తపు మరకలు కనిపించాయి. అయితే ఆ రక్తపు మరకలు ఎవరివి అనేది స్పష్టంగా తెలియరాలేదు. అంతేకాదు ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకలను గుర్తించేందుకు, విచారణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని పోలీసులు పిలిపించారు. అతిక్ అహ్మద్‌ కార్యాలయం ఆవరణలో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 74.62 లక్షల రూపాయల విలువైన 10 అక్రమ ఆయుధాలు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రయాగ్‌రాజ్

ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ సీఎంవో సునీల్ కుమార్ ఆత్మహత్య

ఇదిలా ఉంటే, ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ సీఎంవో సునీల్ కుమార్ సోమవారం ఉదయం నగరంలోని ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించారు. బనారస్ నివాసి సునీల్ కుమార్ మృతదేహం ప్రయాగ్‌రాజ్‌లోని విఠల్ హోటల్‌లోని హోటల్ గదిలో (106) పోలీసులు గుర్తించారు. విఠల్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్‌లో ఈ హోటల్ ఉంది. సాంక్రమిక వ్యాధుల నోడల్ అధికారిగా సునీల్ కుమార్ సింగ్‌ను నియమించారు. ఒకవైపు అతిక్ అహ్మద్ ఆఫీస్‌లో రక్తపు ఆనవాళ్లు లభించడం, సీఎంవో సునీల్ కుమార్ ఆత్మ హత్య చేసుకోవడం వంటి పరిణామాలు ప్రయాగ్‌రాజ్‌ పట్టణంలో సంచలనంగా మారాయి.