
India: సొంత ప్రజలపై బాంబు దాడులు.. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది: భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై బాంబు దాడులు చేస్తుందని భారత్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్థాన్ నిరాధార, రెచ్చగొట్టే ప్రకటనలతో ప్రపంచాన్ని మోసపెడుతోంది, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని ధ్వజమెత్తారు. పాకిస్థాన్ సొంత పౌరులపై బాంబు ఉపయోగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత సృష్టించడం జరుగుతోందని భారత్ ఆరోపించింది.
Details
రాజకీయ వ్యవస్థను సమతుల్యంగా నిర్వహించాలి
భారత్ సూచించినట్లు, సొంత ప్రజలపై దాడులు చేసిన తర్వాత కూడా పాకిస్థాన్ దృష్టి పెట్టాల్సినది, ఆర్థిక వ్యవస్థను కాపాడడం, సైనిక ఆధిపత్యంతో నిండిన రాజకీయ వ్యవస్థను సమతుల్యంగా నిర్వహించడమని అన్నారు. తాజాగా, పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని ఓ గ్రామంపై వైమానిక దాడులు జరిగాయి. పాక్ వాయుసేన చేపట్టిన ఈ దాడుల్లో దాదాపు 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, వీరిలో అనేక చిన్నారులు, మహిళలు ఉన్నారు. కాలిపోయిన వాహనాలు, కూలిపోయిన భవనాలు, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.