Bomb Threats: దిల్లీలో కోర్టులు,విద్యాసంస్థలే లక్ష్యంగా బాంబు బెదిరింపుల కలకలం.. అప్రమత్తమైన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు సంచలనం మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. స్కూళ్లకు, కోర్టులకు వరుసగా బెదిరింపు సందేశాలు చేరాయి. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులతో పాటు రెండు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు కూడా పేలుడు ముప్పు ఉందని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్ డిటెక్షన్ టీములు, డాగ్ స్క్వాడ్లు తక్షణమే రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి. కోర్టు ప్రాంగణాలను ఖాళీ చేయించి ప్రాంతమంతా విచారణ చేపట్టారు. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.
వివరాలు
ఎర్రకోట సమీపంలో పేలుడు.. 14 మంది మృతి
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో సంభవించిన కారు పేలుడులో ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు. ఈ ఘటనలో ఉగ్రవాది ఉమర్ కూడా హతమయ్యాడు. దేశవ్యాప్తంగా భారీ దాడులకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ బ్లాస్ట్ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కుట్రలో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.