LOADING...
Bomb threats: ఢిల్లీలో పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్స్.. మిడ్-టర్మ్ పరీక్షలే రద్దు
ఢిల్లీలో పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్స్.. మిడ్-టర్మ్ పరీక్షలే రద్దు

Bomb threats: ఢిల్లీలో పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్స్.. మిడ్-టర్మ్ పరీక్షలే రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శనివారం ఉదయం పలు పాఠశాలలకు బెదిరింపు కాల్స్ రావడంతో యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాయి. దీనితో పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ కారణంగా మిడ్-టర్మ్ పరీక్షలను రద్దు చేశారు. అలాగే కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్‌, సర్వోదయ విద్యాలయంలోనూ పోలీసులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు.

Details

పరీక్షలు రద్దు

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారులు ఈ రోజు జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను ఇంటికి పంపేశారు. ఇటీవలి కాలంలో దేశంలోని ప్రధాన పట్టణాలైన దిల్లీ, ముంబై, బెంగళూరులో వరుసగా బాంబ్ బెదిరింపులు వస్తున్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలే టార్గెట్ అవుతున్నాయి. దిల్లీలో అయితే ఇది తరచూ పునరావృతమవుతోంది. కొన్నిసార్లు మెయిల్‌ ద్వారా బెదిరింపులు వస్తే.. తాజాగా ఫోన్‌ కాల్స్‌ ద్వారా హెచ్చరికలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా, పోలీసులు ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.