విస్తార విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు
దిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బాంబు ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిర్లో పోర్ట్ లోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎంఆర్ కాల్ సెంటర్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన UK 971 విమానంలో భద్రతా తనిఖీలు నిర్వహించడంతో జాప్యం నెలకొందని, భద్రతా సంస్ధలకు తాము సహకరిస్తున్నట్లు విస్తారా ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కన్నారు. ప్రయాణీకులతో పాటు వారి లగేజీని విమానం నుంచి బయటకు తీసుకువచ్చారు. విమానం టేకాఫ్ తీసుకోవడంలో ఆలస్యమైన కారణంగా ప్రయాణీకులు రెస్ట్ తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు విస్తారా ప్రతినిధి తెలిపారు.