Page Loader
Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ అధికారులు, ఆయా విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బెదిరింపులు అందుకున్నవాటిలో హైదరాబాద్‌ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్‌ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం ఉంది.

Details

బెదిరింపు కాల్స్ పై దర్యాప్తు

ఇటీవలి కాలంలో పలు విమానాలకు అలాంటి బెదిరింపులు వస్తుండటంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. తాజాగా అందుతున్న బెదిరింపులు ఫేక్‌ కాల్స్‌నా, లేక ఉగ్రకోణం ఉందా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు.