LOADING...
Narendra Modi: భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్‌తో కొత్త దిశ!
భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్‌తో కొత్త దిశ!

Narendra Modi: భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్‌తో కొత్త దిశ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది. రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరి ఆర్థిక రంగానికి కొత్త ఊపును తీసుకువచ్చింది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముఖ్యాంశాలపై ఏకాభిప్రాయానికి దారితీశాయి. అధ్యక్షుడు లూలా, ఆయన ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అధ్యక్షులు లూలా, ఆయన బృందాన్ని భారతదేశానికి స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. భారత్-బ్రెజిల్ సంబంధాలు చాలా కాలంగా ఆయన దార్శనికత, స్ఫూర్తిదాయక నాయకత్వం వల్ల లాభపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

Details

అతిపెద్ద వాణిజ్య భాగస్వామి

గత కొన్నేళ్లలో ఇరువురు నాయకులు అనేకసార్లు సమావేశమయ్యారని, ప్రతి భేటీలోనూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలాకు భారతదేశంపై ఉన్న లోతైన స్నేహభావం, విశ్వాసం స్పష్టంగా కనిపించిందని మోదీ వెల్లడించారు. అధ్యక్షుడు లూలా ఈసారి పాల్గొన్న ఏఐ ఇంపాక్టు సమ్మిట్ చారిత్రాత్మకంగా నిలిచిందని, ఈ పర్యటన రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. లాటిన్ అమెరికా ప్రాంతంలో భారతదేశానికి బ్రెజిల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Details

ఇరుదేశాలకే కాకుండా మొత్తం గ్లోబల్ సౌత్‌కు కూడా కీలకమే

రాబోయే ఐదు సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు మించి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. "మా వాణిజ్యం కేవలం సంఖ్య కాదు, ఇది పరస్పర విశ్వాసానికి ప్రతిబింబం. అధ్యక్షుడు లూలాతో కలిసి వచ్చిన పెద్ద వ్యాపార ప్రతినిధి బృందం ఆ నమ్మకాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్-బ్రెజిల్ సహకారం కేవలం ఇరుదేశాలకే కాకుండా మొత్తం గ్లోబల్ సౌత్‌కు కూడా కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. AI, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్ రంగాల్లో భాగస్వామ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త మార్గదర్శకత్వాన్ని అందించగలవని చెప్పారు. అదేవిధంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసికట్టుగా పోరాడతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisement