Loading...
Borugadda Anil: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన

Borugadda Anil: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్‌ తన భార్యతో కలిసి మంగళవారం నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం కల్పించాలని కోరుతూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు వైకాపా సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.

వివరాలు 

కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: బోరుగడ్డ అనిల్

పార్టీ కోసం దాదాపు పదేళ్ల పాటు కష్టపడి పనిచేశానని,తొమ్మిది నెలలు జైలులో కూడా గడిపానని తెలిపారు. అలాగే, తనను 'రౌడీషీటర్‌'గా వ్యాఖ్యానించిన కారుమూరి వెంకట్‌రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

పార్టీకి చెందిన నేతలే తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని బోరుగడ్డ అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సజ్జల బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బోరుగడ్డ అనిల్‌ డిమాండ్

ADVERTISEMENT