పవన్ కళ్యాణ్ బైజూస్ ట్వీట్ పై బొత్స కామెంట్స్: ట్యూషన్ చెప్తానంటున్న మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
బైజూస్‌తో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే.
నష్టాల్లో ఉన్న బైజూస్ సంస్థకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని, టెండర్ కు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయా అని ప్రశ్నించారు.
తాజాగా ఈ ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌కు ట్యూషన్ చెప్తానని, కాని హోమ్ వర్క్ చేస్తానంటేనే ట్యూషన్ చెప్తానని ఏడు సమాధానాలు ఇచ్చారు.
టెండర్లకు సంబంధించిన అర్హత లేదా పరిధిని నిర్ణయించడానికి రాష్ట్రప్రభుత్వానికి అధికారం ఉందని బొత్స గుర్తు చేసారు.
Details
టెండర్లో పాల్గొన్న కంపెనీలేంటో తెలుసుకునేందుకు గూగుల్ లింక్
వందకోట్లకు పై బడిన టెండర్లు హైకోర్టు జడ్జి సమక్షంలో ఫైనల్ అవుతాయని అన్నారు. జడ్జి నిర్ణయం తీసుకున్నాకే టెండర్లకు లాక్ వేస్తామని అన్నారు.
ఇంకా టెండర్లకు సంబంధించిన అన్ని వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని తెలియజేసారు. అలాగే టెండర్లలో ఏయే కంపెనీలు పాల్గొన్నాయో గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుందని లింక్ కూడా ఇచ్చారు.
టెండర్లను లాక్ చేసాక న్యాయపరమైన ప్రివ్యూను కూడా అందించామని, అందుకు గర్వపడుతున్నామని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
విద్యకు సంబంధించిన విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దానివల్లే ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయని అన్నారు.
ఇలాంటి ట్యూషన్ ఎన్నిసార్లు ఇవ్వడానికైనా తాను రెడీ అని పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ కౌంటర్ వేసారు.