Loading...
BPCL: కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు.. బీపీసీఎల్ ట్వీట్ తొలగింపు!
కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు.. బీపీసీఎల్ ట్వీట్ తొలగింపు!

BPCL: కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు.. బీపీసీఎల్ ట్వీట్ తొలగింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. చివరకు ఆ సంస్థ తన ట్వీట్‌ను తొలగించింది.మైసూరులోని ఓ పెట్రోల్ బంక్‌లో నిర్వహించిన పరీక్షల్లో పెట్రోల్‌లో ఇథనాల్ శాతం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితిలోనే ఉందని బీపీసీఎల్ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 33వరకు ఉందని ఆరోపించారు. దీంతో బీపీసీఎల్ ట్వీట్‌ను తొలగించింది. అయినప్పటికీ,అప్పటికే పలువురు ఆ ట్వీట్ స్క్రీన్‌షాట్లను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. కాగా,పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీపీసీఎల్  ట్వీట్‌ 

వివరాలు 

కర్ణాటకలో ఇథనాల్ కలపడంపై రాజకీయ దుమారం

చమురు సంస్థలు విక్రయిస్తున్న పెట్రోల్‌లో నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), షెల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన 63 నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఆరోపణలతో భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం మొదలైంది.

ADVERTISEMENT

వివరాలు 

పెట్రోల్ బంకుల్లో తనిఖీలకు కేరళ ప్రభుత్వం..

కర్ణాటకలో ఇథనాల్ కలపడంపై ఆరోపణలు రావడంతో కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో యాదృచ్ఛిక తనిఖీలు ప్రారంభించింది.

ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది.

తొలిదశ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే.. మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ తనిఖీలను విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత పెట్రోల్ బంకులను మూసివేస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.

బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇథనాల్ కలపడంపై మొదలైన ఈ వివాదం వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే ఆందోళనలకు కారణమవుతోంది.

మరోవైపు వివిధ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు కూడా దారితీస్తోంది.

ADVERTISEMENT