
Shimla: శిమ్లా ఎయిర్పోర్ట్లో తప్పిన పెను ప్రమాదం.. అదుపుతప్పిన విమానం..!
ఈ వార్తాకథనం ఏంటి
శిమ్లా ఎయిర్‌పోర్టులో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ నెంబర్ 91821 నేడు రన్‌వే నుంచి అదుపుతప్పి దూసుకెళ్లింది.
ఈ విమానంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రి, రాష్ట్ర డీజీపీ అతుల్ వర్మ సహా 44 మంది ప్రయాణికులు ఉన్నారు.
దిల్లీ నుంచి బయలుదేరి శిమ్లాలో ల్యాండింగ్ చేసే సమయంలో విమానం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
పైలట్ ఈ విషయం ప్రయాణికులకు తెలియజేసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు.
దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు అలయన్స్ ఎయిర్ అధికారికంగా స్పందించలేదు. ఈ విమానం దిల్లీ-శిమ్లా-ధర్మశాల-దిల్లీ మార్గంలో నడుస్తుంటుంది.
వివరాలు
రన్‌వే చివరికి దూసుకెళ్లి..
''ఈ ఉదయం మేము విమానంలో శిమ్లా చేరుకున్నాం. ల్యాండింగ్ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. సాంకేతిక విషయాలు నాకు తెలియదు, కానీ విమానం కచ్చితంగా ల్యాండ్ కావాల్సిన చోట దిగలేదు, ఆగాల్సిన చోట ఆగలేదు. చివరకు రన్‌వే చివరికి దూసుకెళ్లి ఆగింది. వేగాన్ని తగ్గించేందుకు శక్తివంతమైన బ్రేకులు వేయాల్సి వచ్చింది. అనంతరం మరో 25 నిమిషాలపాటు విమానంలోనే ఉండాల్సి వచ్చింది'' అని హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం అగ్నిహోత్రి తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అదుపుతప్పిన విమానం..!
All the 44 passengers and crew are safe at Jubbarhatti Airport in Shimla, India after the aircraft (VT-UDB) could use only half of the Runway and came to a stop at the end of the Runway (14/32) on 24 March.
— FL360aero (@fl360aero) March 24, 2025
On the Monday morning event at the Shimla Airport, the Alliance Air ATR… pic.twitter.com/t869MzKJbq