Page Loader
SanthiSwaroop: ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!
ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!

SanthiSwaroop: ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ ,యాంకర్ శాంతి స్వరూప్ మృతి చెందారు. ఇటీవల గుండెపోటుకు గురైన అయన హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్ లో వార్తలు చదివిన తోలి న్యూస్ రీడర్ గా అయన ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత న్యూస్ రీడర్లలో అయన చాల మందికి గురువుగా ఉన్నారు. కాగా 2011లో అయన పదవి విరమణ చేశారు. ఇక, 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటిగా తెలుగు న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. టెలీప్రాంప్టర్‌ లేని రోజులలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా న్యూస్ చదివి అందరి మన్నలను పొందారు శాంతి స్వరూప్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తోలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత