Page Loader
Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2023
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌, నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు సెంట్రల్‌ జోన్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది. ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఇంకా మరికొంతమంది మంటలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం