Page Loader
హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి 
శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2023
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో సిమ్లాలోని కొండచరియలు విరిగిపడిపోవడంతో ఓ శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయానికి 50 మంది వరకు వచ్చారు. అదే సమయంలో ఆలయంపై కొండచరియలు విరిగిపడడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. ఆలయం కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆలయం కూలిన ఘటనపై సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి