Loading...
Amritsar Firing: అమృత్‌సర్‌లో కాల్పుల కలకలం.. ఆప్ సర్పంచ్ సోదరుడిని కాల్చి చంపిన దుండగులు
అమృత్‌సర్‌లో కాల్పుల కలకలం.. ఆప్ సర్పంచ్ సోదరుడిని కాల్చి చంపిన దుండగులు

Amritsar Firing: అమృత్‌సర్‌లో కాల్పుల కలకలం.. ఆప్ సర్పంచ్ సోదరుడిని కాల్చి చంపిన దుండగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్పంచ్ కరజ్ సింగ్ సోదరుడు తీరత్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. చాతివిండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీరత్ సింగ్ స్నేహితుడు రంజిత్ సింగ్ కూడా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. తీరత్ సింగ్ తన స్నేహితుడు రంజిత్ సింగ్‌తో కలిసి గురుద్వారాలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో తీరత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వివరాలు 

ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఈ ఘటనలో బుల్లెట్ గాయాలైన రంజిత్ సింగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎస్పీ యద్విందర్ సింగ్ తెలిపారు.

అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, గతంలో ఉన్న భూ వివాదమే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన వెనుక రాజకీయ కక్షలు లేవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

మరోవైపు, గ్రామంలోని ప్రత్యర్థి వర్గానికి చెందిన వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని తీరత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గురుద్వారా వ‌ద్ద ఆమ్ ఆద్మీ పార్టీ స‌ర్పంచ్ సోద‌రుడి కాల్చివేత

ADVERTISEMENT