NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్ బై
    తదుపరి వార్తా కథనం
    Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్ బై
    గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్ బై

    Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్ బై

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 06, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో రాజకీయ ముసలం జోరు అందుకుంటోంది.మరో 2 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.

    ఈ మేరకు ఖానాపూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీకి, ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

    బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం లేదని, ఈ క్రమంలోనే పార్టీని వీడుతున్నానని తెలిపారు.

    అయితే అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అసెంబ్లీకి కచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారో అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

    రేఖా భర్త శ్యామ్‌ నాయక్‌ మాత్రం ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.ఈ నేపథ్యంలోనే రేఖా కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.

    DETAILS

    కాంగ్రెస్ ఖానాపూర్ టిక్కెట్ రేసులో రేఖా నాయక్

    ఆగస్ట్ 21న అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.

    ఈ మేరకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ పేరును ప్రకటించారు.

    దీంతో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రేఖా నాయక్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

    ఈ మధ్యే టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ లో రేఖా నాయక్ కూడా ఖానాపూర్ అభ్యర్థిగా తన పేరిట ఓ అప్లికేషన్ పెట్టుకున్నారు.

    ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిని మంత్రి కేటీఆర్ అడ్డుకున్నారని రేఖా ఆరోపించారు. ఈ మేరకు జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ సవాల్ చేశారు. బీఆర్ఎస్ లో మహిళలకు విలువలేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల

    తెలంగాణ

    CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ బీఆర్ఎస్
    తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు భారతదేశం
    తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే  కాంగ్రెస్
    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025