Page Loader
5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం 
5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం

5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2023
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,తెలంగాణ,మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 మధ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (EC) విశ్వసనీయ వర్గాలకి వెల్లడించాయి. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది.రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం,తెలంగాణ రాష్ట్రాలలో 2018లో కూడా ఇలాగే ఎన్నికలు నిర్వహించింది ఈసీ. ఛత్తీస్‌గఢ్‌లో, 2018లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించింది.ఈ సారి కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్టు సమాచారం. మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు.

Details 

ఎన్నికల కసరత్తు మొదలు పెట్టిన ఈసీ 

ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)అధికారంలో ఉంది. తెలంగాణ,రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తెలంగాణలో పాలించగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు, ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కసరత్తుని మొదలు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల కసరత్తు సజావుగా సాగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం శుక్రవారం తన పరిశీలకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.