LOADING...
Gurugram: గురుగ్రామ్‌లో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు సామూహిక అత్యాచారం
గురుగ్రామ్‌లో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు సామూహిక అత్యాచారం

Gurugram: గురుగ్రామ్‌లో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు సామూహిక అత్యాచారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎన్నో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై దారుణమైన ఘటనలు తగ్గడం లేదు. తాజాగా ముంబైలో ఒక డెలివరీ బాయ్ పై జరిగిన ఘటన మరువకముందే గురుగ్రామ్‌లో మరొక ఘోరం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి పిలుపు మేరకు పార్టీకి వెళ్లిన ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిని జిమ్ శిక్షకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి గురిచేశారు. గురుగ్రామ్‌కు చెందిన ఈ మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమె ఒక ప్రముఖ పాఠశాలలో విదేశీ భాషలను బోధిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల గౌరవ్ అనే వ్యక్తి సెప్టెంబర్‌లో ఒక పార్టీలో స్నేహితుడుగా పరిచయమై, ఫోన్ ద్వారా, అలాగే వ్యక్తిగతంగా పలుమార్లు కలుసుకుని సంభాషించారు.

Details

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అక్టోబర్ 1న, గౌరవ్ ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడాలని ఆహ్వానించాడు. ఆహ్వానంతో ఆమె గురుగ్రామ్‌లోని గౌరవ్ స్నేహితుడైన నీరజ్ (32) ఇంటికి చేరుకుంది. ఆ గృహంలోనే గౌరవ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత స్నేహితులైన నీరజ్, యోగేష్ (29), అభిషేక్ (28) లను ఫోన్ చేసి రప్పించి, వారితో వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాతి రోజు ఉదయం, బాధిత మహిళ ఉమెన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురి నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.