Loading...
Pawan Kalyan: అప్పుల బాధతో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద బిల్డర్ ఆత్మహత్యాయత్నం
అప్పుల బాధతో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద బిల్డర్ ఆత్మహత్యాయత్నం

Pawan Kalyan: అప్పుల బాధతో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద బిల్డర్ ఆత్మహత్యాయత్నం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఓ బిల్డర్ హల్‌చల్ సృష్టించాడు. అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ వృత్తిరీత్యా బిల్డర్. ఈ నెల 18న ఆయన జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్నాడు. తనపై ఉన్న అప్పులు తీర్చేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఓ ప్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసనకు దిగాడు. తనకు సహాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

వివరాలు 

బౌన్సర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

దీంతో సుచేతన్ బౌన్సర్‌పై దాడికి యత్నించాడు. అనంతరం తన వెంట తీసుకొచ్చిన కత్తితో ఛాతీ, చేతులపై కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన బౌన్సర్ వెంటనే అతడిని అడ్డుకుని, అతడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నాడు.

ఈ ఘటనపై బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ADVERTISEMENT