Loading...
Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు, కొనసాగుతున్న సహాయక చర్యలు!
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు, కొనసాగుతున్న సహాయక చర్యలు!

Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు, కొనసాగుతున్న సహాయక చర్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భవనం కూలినట్లు మధ్యాహ్నం సమయంలో సమాచారం అందడంతో సహాయక సిబ్బంది, పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసి.. శిథిలాలను తొలగించే పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. అయితే శిథిలాల కింద ప్రస్తుతం ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి గురైన భవనం దిల్లీ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌కు ఎదురుగా ఉండటంతో.. అందులో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు

PG వసతి గృహంగా వినియోగం

కూలిపోయిన ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్‌ గెస్ట్‌ (PG) వసతి గృహంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో చాలా మంది విద్యార్థులు తమ గదుల్లోనే ఉన్నట్లు సమాచారం.

భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT