LOADING...
Kolkata: కోల్‌కతా టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్‌..  
కోల్‌కతా టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్‌..

Kolkata: కోల్‌కతా టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల ప్రభావంతో పలుప్రాంతాల్లో భాజపా,తృణమూల్‌ వర్గాల మధ్య గొడవలు చెలరేగి ఉద్రిక్తత పెరిగింది. ఈపరిణామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతాలో మరో కలకలం రేగింది. తృణమూల్‌కు చెందిన పార్టీ కార్యాలయాన్ని బలవంతంగా కూల్చివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. హాగ్‌ మార్కెట్‌ పరిధిలోని న్యూమార్కెట్‌ యూనియన్‌ కార్యాలయం వద్దకు అర్ధరాత్రి సమయంలో కొందరు వచ్చి బుల్డోజర్‌తో భవనాన్ని కూల్చివేశారు. ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో అకస్మాత్తుగా ఈఘటన జరగడంతో అక్కడి వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమించవచ్చనే ఆందోళనతో దుకాణాలు మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈఘటనలో తృణమూల్‌ కార్యాలయం పూర్తిగా నేలమట్టమవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోల్‌కతాలో హైటెన్షన్

Advertisement