New criminal laws: కొత్త క్రిమినల్ చట్టాల ఆమోదం కోసం మా గొంతు నొక్కుతారా ? విపక్షం ధ్వజం
కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి తేవటానికి న ప్రతిపక్షాలు ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపిదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా బలవంతంగా చట్టాన్ని ఆమోదించారని విపక్షాలు విరుచుకుపడ్డాయి . చట్టాలలోని ప్రధాన భాగాలను "కట్, కాపీ పేస్ట్ జాబ్" అని తీవ్రంగా ఆరోపించారు.
తగిన చర్చ లేకుండా పార్లమెంటులో..
గత డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, సంబంధిత బిల్లులను తగిన చర్చ లేకుండా వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టారని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో రాజకీయ, నైతిక షాక్‌ల తర్వాత, మోదీజీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తూర్పారబట్టారు. అయితే నిజం ఏమిటంటే నేటి నుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ వ్యవస్థ చట్టాలను 146 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ బలవంతంగా ఆమోదించారని తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ 'బుల్‌డోజర్ జస్టిస్'ని పార్లమెంటరీ వ్యవస్థపై నడపడానికి భారతదేశం ఇకపై అనుమతించదు' అని ఆయన అన్నారు.
బుల్‌డోజర్ జస్టిస్ ని అనుమతించం: విపక్ష ఎంపీలు
ఉభయ సభల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాన్ని ఖర్గే ప్రస్తావించారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాల నిరసన మధ్య సామూహిక సస్పెన్షన్‌లు జరిగాయి.కొత్త చట్టాల్లో 90-99 శాతం 'కట్, కాపీ, పేస్ట్ జాబ్' అని, కాంగ్రెస్ నేత చిదంబరం తెలిపారు. ఇప్పటికే ఉన్న చట్టాలకు కొన్ని సవరణలతో ప్రభుత్వం అవే ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎంపీలు, న్యాయ పండితులు, న్యాయవాదులు లేవనెత్తిన విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంటులో విలువైన చర్చ జరగలేదని చిదంబరం మండిపడ్డారు.కొత్త క్రిమినల్ చట్టాలను పార్లమెంటు పునఃపరిశీలించాలని, దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చేందుకు అవి పునాది వేస్తాయని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు.
సూలే, ఘోస్ పోస్ట్ లో ఏమన్నారంటే
"పోలీసు అధికారాన్ని విస్తరించడం, రిమాండ్ వ్యవధిని పొడిగించడం, ఏకాంత నిర్బంధాన్ని అనుమతించడం , న్యాయపరమైన పర్యవేక్షణను తగ్గించడం ద్వారా, NDA ప్రభుత్వం అణచివేత పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తోంది. భారత ప్రజాస్వామ్యం , ఆత్మ ప్రమాదంలో ఉంది తాము మౌనంగా ఉండలేము," అని సూలే పోస్ట్ చేసారు. 'దేశద్రోహం' నేరం బ్యాక్‌డోర్‌లోకి ప్రవేశించింది . ప్రమాదకరమైనది" అని ఘోస్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదం గురించి మొదటి సారి నిర్వచించారు.. రోజువారీ నేరపూరిత నేరాలలో ఒక భాగం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒక పురుషుడు ఒక స్త్రీతో వివాహానికి సంబంధించిన వాగ్దానాలపై 'వంచన'ను నేరంగా మార్చడం ద్వారా గోప్యతలోకి చొరబాటుకు గురవుతాయని విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
వలసవాదుల క్రిమినల్ చట్టాల స్ధానంలో ఆధునిక న్యాయ వ్యవస్థ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు వలసరాజ్యాల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC), 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1973 , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో ఉన్నాయి. ఇదిలా వుండగా చట్టాలను ప్రయోగాత్మకంగా రూపొందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కొత్త చట్టాలు న్యాయాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తాయని చెప్పారు. వలసరాజ్యాల కాలం చట్టాలు శిక్షా చర్యలకు ప్రాధాన్యతనిచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్ పోలీసు ఫిర్యాదుల నమోదు,ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా సమన్లు జారీ వంటివి వున్నాయి. వీటితో సహా అన్ని ఘోరమైన నేరాలకు నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలతో కూడిన కొత్త చట్టాలు "ఆధునిక న్యాయ వ్యవస్థ"ని తీసుకువచ్చాయి.