PVN Madhav: విశాఖకు బుల్లెట్ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్ మాధవ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 31, 2026
02:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. రైల్వే జోన్ సాధన కోసం భారతీయ జనతా పార్టీ మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటం సాగించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశాన్ని చేర్చడంలో బీజేపీ పాత్ర ఎంతో కీలకమైందని, ఆ పార్టీ చేసిన కృషి అనిర్వచనీయమని మాధవ్ తెలిపారు.
వివరాలు
రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు
అలాగే విశాఖపట్నం కేంద్రంగా బుల్లెట్ రైలు సేవలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వే మంత్రి తెలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పీవీఎన్ మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.