కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మద్య, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా మైసూర్‌లోని బుధవారం రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ సొమ్మును సుబ్రమణ్య రాయ్ మామిడిచెట్టుపై పెట్టెలో దాచిపెట్టడం గమనార్హం. ఇది చూసిన ఐటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో గత కొన్ని వారాలుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 13న కోటి రూపాయల కూడా మరో రూ.కోటి స్వాధీనం
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 13న కోటి రూపాయల నగదుతో ఇద్దరు వ్యక్తులు బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డారు. కర్ణాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడం రాష్ట్రంలో అనుమతించబడదు. గత నెలలో కూడా హుబ్బళ్లిలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అంకిత బిల్డర్స్ కార్యాలయం, దాని యజమాని నారాయణ్ ఆచార్య నివాసంపై ఐటీ బృందాలు దాడులు నిర్వహించాయి. దక్షిణ కన్నడలోని బెల్తంగడిలోని కాంగ్రెస్ మాజీ నాయకుడు గంగాధర్ గౌడకు చెందిన రెండు నివాస స్థలాలు, విద్యా సంస్థ ఆఫీస్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత సుబ్రమణ్య రాయ్ ఇంట్లో దాడులు జరగడం గమనార్హం.