
హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని కారుతో సహా సజీవదాహనం చేసిన ఘటన భివానీ జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించామని లోహారు (భివానీ) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ సింగ్ తెలిపారు.
హర్యానాలోని భివానీ జిల్లాలో గురువారం ఉదయం మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో కాలిబూడిదై కనిపించారు. అయితే ఈ హత్య బుధవారమే జరిగినట్లు తెలుస్తోంది.
బుధవారం ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాలిపోయిన వాహనం నంబర్ బట్టి యాజమాని అసీన్‌ఖాన్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులను పిలిపించి వాహనాన్ని గుర్తించామని, మృతదేహాలను పరిశీలించిన తరువాత బంధువులకు అప్పగిస్తామన్నారు.
హర్యానా
ఈ ఘటనపై ధర్యాప్తును కొనసాగిస్తున్నాం
భరత్‌పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ స్పందిస్తూ "కారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయని, కిడ్నాప్ అయిన ఆ ఇద్దరు వ్యక్తులు, చనిపోయిన ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరేనా కాదా అనేది నిర్ధారించడానికి తమ బృందం కుటుంబ సభ్యులతో సంఘటనా స్థలానికి వెళ్ళిందన్నారు.
పోస్ట్ మార్టం, డీఎన్ఏ అనంతరం మరిన్ని వివరాలను తెలియజేస్తామన్నారు.
ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక గోసంరక్షుకులుగా ప్రచారం అవుతున్న ఐదుగురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి