Page Loader
TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదించారు. ప్రస్తుత చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియడంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.

Details

ఆమోదం తెలిపిన గవర్నర్

బుర్రా వెంకటేశం పేరును సీఎం కేసీఆర్ ఎంపిక చేసి, నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా, ఆయన ఆమోదం చేశారు. బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బుర్రా వెంకటేశం గురించిన అభిప్రాయాలను పలు వేదికలపై ప్రస్తావించారు.