Page Loader
Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం
దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం

Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2023
09:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మంగళవారం ఓ వ్యాపారి భార్యపై ఐదుగురు మృగాళ్లు సిగరెట్‌తో వాతలు పెట్టి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. దొంగతనం జరిగిన సమయంలో వ్యాపారవేత్త తన తల్లి, పిల్లలతో కలిసి మందులు కొనడానికి బయటకు వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన ఐదుగురు దుండగులు రాత్రి 7.30 సమయంలో పక్కింటి ఇంటిపై కప్పు నుంచి వాళ్ల ఇంట్లోకి ప్రవేశించారు. నిందితులు దొంగతతనం చేసే ముందు మత్తుముందు కలిపిన క్లాత్‌ను ఆమెకు వాసన చూపి ఆమెకు స్పృహ తప్పేతట్టు చేశారు. ఆపై ఆమె కాళ్లు చేతులు కట్టేసిన సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక అత్యాచారం చేశారు

Details 

విచారణకు మూడు బృందాల ఏర్పాటు

అనంతరం ఇంట్లోని అల్మారాలు తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు,రెండు కిలోల వెండి, సుమారు ₹ 1.5 లక్షల విలువైన నగదు స్కూటర్‌ను దోచుకెళ్లారు. ఆమెకు స్పృహ వచ్చేసరికి, తన కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిన్న సాయంత్రం కేసు నమోదు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షలకు తరలించారు. ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు.