Loading...
92 GWh Energy Storage: విద్యుత్ నిల్వకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 92 GWh సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు
విద్యుత్ నిల్వకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 92 GWh సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు

92 GWh Energy Storage: విద్యుత్ నిల్వకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 92 GWh సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు పారిశ్రామిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబరు 4న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 92 గిగావాట్ అవర్ల (GWh) సామర్థ్యంతో గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ పథకానికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు 24 కీలక ఖనిజాల శుద్ధి పథకానికి, దేశీయ గణాంక వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.4,371 కోట్ల నిధుల కేటాయింపునకు కూడా ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

వివరాలు 

92 GWh విద్యుత్ నిల్వ పథకం.. మూడు విభాగాలు

దేశవ్యాప్తంగా గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, సౌర, పవన విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

92 గిగావాట్ అవర్ల సామర్థ్యంతో కూడిన ఈ విద్యుత్ నిల్వ వ్యవస్థను రాష్ట్రాలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. గ్రిడ్ స్థాయిలో నేరుగా పనిచేసే అతిపెద్ద విద్యుత్ నిల్వ వ్యవస్థగా ఇది నిలవనుందని పేర్కొన్నారు.

ఈ పథకంలో మొత్తం మూడు రకాల విద్యుత్ నిల్వ విధానాలను ప్రతిపాదించారు. -

30 GWh బ్యాటరీ నిల్వ: బ్యాటరీల ద్వారా విద్యుత్‌ను నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకునే విధానం.

వివరాలు 

92 GWh విద్యుత్ నిల్వ పథకం.. మూడు విభాగాలు

60 GWh పంప్డ్ స్టోరేజ్: పగటిపూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను ఉపయోగించి నీటిని ఎత్తైన ప్రాంతాలకు పంపిస్తారు. రాత్రి సమయంలో ఆ నీటిని కిందకు విడుదల చేయడం ద్వారా ఉత్పత్తయ్యే గతిజ శక్తితో విద్యుత్‌ను తయారు చేస్తారు.

2 GWh నూతన సాంకేతికతలు: భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త విద్యుత్ నిల్వ సాంకేతిక పరిష్కారాల కోసం ఈ సామర్థ్యాన్ని కేటాయించారు.

ADVERTISEMENT

వివరాలు 

విద్యుత్ సరఫరా వ్యవస్థకు ప్రయోజనం

దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజయేతర ఇంధనాల వాటా ప్రస్తుతం 52 శాతానికి చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు.

అయితే రాత్రి సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో విద్యుత్ తరలింపు వ్యవస్థలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదని వివరించారు.

విద్యుత్ నిల్వ వ్యవస్థలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విద్యుత్ తరలింపు సామర్థ్యాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

ఉదాహరణకు, ఒక సౌర విద్యుత్ కేంద్రం కోసం 10 మెగావాట్ల విద్యుత్ తరలింపు సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినా, రాత్రి సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో ఆ సామర్థ్యం పూర్తిగా వినియోగం కాదని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

విద్యుత్ సరఫరా వ్యవస్థకు ప్రయోజనం

విద్యుత్ నిల్వ వ్యవస్థలు లేకుంటే విద్యుత్ తరలింపు సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు పెట్టుబడులు అవసరమవుతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు.

అదే నిల్వ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, పునరుత్పాదక విద్యుత్‌ను నిల్వ చేసుకుని, అందుబాటులో ఉన్న 10 మెగావాట్ల విద్యుత్ తరలింపు సామర్థ్యాన్ని 24 గంటలూ సమర్థంగా వినియోగించుకోవచ్చని చెప్పారు.

వివరాలు 

24 కీలక ఖనిజాల శుద్ధికి ప్రత్యేక పథకం

పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి 24 రకాల కీలక ఖనిజాల శుద్ధి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద గనుల నుంచి సేకరించిన ఖనిజాలతో పాటు, రీసైక్లింగ్ ద్వారా లభించే ముడి పదార్థాలను కూడా శుద్ధి చేస్తారు.

వాటిని తయారీ పరిశ్రమల్లో నేరుగా ఉపయోగించుకునే స్థాయికి తీసుకురావడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, రక్షణ రంగ పరికరాలు, భారీ యంత్రాల తయారీ వంటి పరిశ్రమలకు ఈ శుద్ధి చేసిన ఖనిజాలు కీలక ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి.

వివరాలు 

గణాంక వ్యవస్థ ఆధునికీకరణకు రూ.4,371 కోట్లు

దేశంలో డేటా నిర్వహణ, సర్వేల విధానాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4,371 కోట్లతో కొత్త పథకాన్ని చేపట్టనుంది.

దేశీయ గణాంక వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ పథకంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన, డేటా సేకరణను మరింత తరచుగా చేపట్టడం, నిర్ణీత వ్యవధుల్లో మూల్యాంకనం, ఆధునిక సర్వే పద్ధతుల అమలు, సర్టిఫికేషన్ కోర్సుల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

అలాగే సర్వేల్లో డేటా సేకరణ సమయంలో తలెత్తే ఏకపక్ష ధోరణిని తగ్గించి, మరింత కచ్చితమైన సమాచారాన్ని సేకరించేలా జాతీయ గణాంక వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.

ADVERTISEMENT