LOADING...
First since 2019:  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం

First since 2019:  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కేంద్ర కేబినెట్ ప్రస్తుత 34 మంది జడ్జిల సంఖ్యను 38కి పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం, ఈ మార్పుకు సంబంధించిన బిల్లు త్వరలో పార్లమెంట్ వచ్చే సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు కూడా ఉన్నాయి.

వివరాలు 

కేంద్ర న్యాయశాఖ, ఆర్థికశాఖలతో చర్చించి కేబినెట్‌కు ప్రతిపాదన

పార్లమెంట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే, మొత్తం జడ్జిల సంఖ్య 38కు చేరుతుంది. చివరిసారిగా 2019లో జడ్జిల సంఖ్యను 30 నుంచి 33కి (సీజేఐ మినహా) పెంచారు. 1956లో మొదటగా ఈ సంఖ్య 10గా ఉండగా, తరువాత వివిధ సవరణలతో క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారత రాజ్యాంగంలోని Article 124(3) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వాలంటే హైకోర్టు జడ్జిగా కనీసం ఐదేళ్లు లేదా అడ్వకేట్‌గా 10 ఏళ్లు అనుభవం ఉండాలి..లేదా ప్రముఖ న్యాయ నిపుణుడై ఉండాలి. సీజేఐ సిఫార్సు మేరకు కేంద్ర న్యాయశాఖ, ఆర్థికశాఖలతో చర్చించి కేబినెట్‌కు ప్రతిపాదనను పంపుతుంది.

Advertisement