LOADING...
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు

Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శాఖ మార్పు ఉండొచ్చని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే పలువురు కేబినెట్‌ మంత్రుల శాఖల్లో మార్పులు చేయడంతో పాటు అనేక మంది సహాయ మంత్రులను పదవుల నుంచి తప్పించే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి ఆదివారం వరకు సీషెల్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

రాష్ట్రపతితో అమిత్‌ షా భేటీ

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రధాని మోదీ బుధవారం తొమ్మిది మంది సహాయ మంత్రులతో సమావేశమై, వారి శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశానికి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో అమిత్‌ షా, పీయూష్‌ గోయెల్‌తో పాటు ఇతర కీలక నేతలు వరుసగా సమావేశాలు నిర్వహించడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ కలిసి కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు జరగనున్నాయనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

Advertisement