LOADING...
Musi Project: రూ.7,055 కోట్లతో మూసీ తొలి దశ పనులు
రూ.7,055 కోట్లతో మూసీ తొలి దశ పనులు

Musi Project: రూ.7,055 కోట్లతో మూసీ తొలి దశ పనులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూసీ ప్రాజెక్టు పనులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. తొలి దశలో చేపట్టనున్న పనుల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుతో చర్చలు పూర్తయ్యాయని ఉపసంఘానికి తెలిపారు. ప్రారంభ దశలో రూ.7,055 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిర్మాణాలపై ప్రభావం లేకుండా ఉండే ఐదు కిలోమీటర్ల పరిధిలో ముందుగా పనులు ప్రారంభించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలపై ప్రభావం తగ్గే విధంగా మార్గరేఖలో మార్పులు చేయాలని మంత్రులు సూచించారు.

వివరాలు 

రబ్బరు ఆనకట్ట నమూనాలను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం

మూసీ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పనుల కారణంగా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మూసీ నదిపై ఏర్పాటు చేయనున్న రబ్బరు ఆనకట్ట నమూనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది.

Advertisement