Supreme Court: నిరసనల పేరుతో స్థలాల ఆక్రమణ సరికాదు: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
నిరసన ప్రదర్శనలు నిర్వహించే పేరుతో ఏ ఒక్కరూ ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలకు నిర్దిష్ట సమయ పరిమితి ఉండాలని అభిప్రాయపడింది. సెంట్రల్ ఢిల్లీలో గత నెలలో ఎన్నికల సంఘం (సీఈసీ)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి.
వివరాలు
ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది
ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫున న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ.. నిరసన ప్రదర్శనకు ఎవరైనా పిలుపునిస్తే, దాని వల్ల కలిగే పరిణామాలను వారే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
దీనిపై సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. ఒక ప్రదేశాన్ని ఎప్పటికీ ఆక్రమించుకోలేరని పేర్కొన్నారు.
నిరసనలు చేపట్టేందుకు ఇతరులకు కూడా అవకాశం కల్పించాలని, రైతులు, న్యాయవాదులు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.
ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు
News Alert! You can't occupy protest site for all times; there are others who would also like to vent their grievances: SC. pic.twitter.com/1lsL3MuYSO
— Press Trust of India (@PTI_News) November 3, 2026