Page Loader
అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం 
అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం

అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసోంలోని గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజారా ప్రాంతం నుంచి వేగంగా వస్తున్న కారు, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న వ్యానును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందగా, వ్యానులోని ముగ్గురితో సహా మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురు అస్సాం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిన దృశ్యాలు