Page Loader
Hyderabad: అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్‌' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి .. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు
అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్‌' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి

Hyderabad: అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్‌' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి .. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
07:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన 'కిడ్నీ రాకెట్‌' కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో విచారించడమని మంత్రి ఆదేశించారు. మరోవైపు, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి ఛైర్మన్‌ సుమంత్‌, గోపి అనే వ్యక్తి సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్‌, గోపీని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.