తదుపరి వార్తా కథనం

Prasanna Kumar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 09, 2025
03:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని సంబంధించి ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కోవూరు పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భారత శిక్షా సంహితలోని 74, 75, 79, 296వ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసుతో సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయనను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.