Page Loader
Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్
Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్

Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్

వ్రాసిన వారు Stalin
Jan 28, 2024
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని కల్కాజీ టెంపుల్‌లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17మందికి గాయాలు కాగా, ఒక మహిళ మృతి చెందింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 12గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గాయకుడు బి ప్రాక్ ఈ జాగరణకు వచ్చారు. అతన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో వేదికపై ప్రాక్ ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే.. వేదిక కూలిపోయింది. అనంతరం వేదిక ముందు తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు. వీఐపీల కోసం నిర్మించిన స్జేజీ పైకి భారీ సంఖ్యలో జనం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్జేజ్ కూలిన దృశ్యాలు