LOADING...
Madhya Pradesh: దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కి.. పరారీలో ఉన్న మ‌హిళా డీఎస్పీ ఆఫీస‌ర్
దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కి.. పరారీలో ఉన్న మ‌హిళా డీఎస్పీ ఆఫీస‌ర్

Madhya Pradesh: దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కి.. పరారీలో ఉన్న మ‌హిళా డీఎస్పీ ఆఫీస‌ర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా పోలీసు అధికారి దొంగతనానికి పాల్పడిన సంఘటన పెద్ద సంచలనం రేపింది. ఈఘటన భోపాల్‌లోని జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన స్నేహితురాలి ఇంట్లోనే ఆమె నగదు ఎత్తుకెళ్లడం అక్కడి పోలీసు వర్గాలను షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే..భోపాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కల్పనా రఘువంశీ అనే అధికారి డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ నుంచి రెండులక్షల రూపాయల నగదు,ఒక మొబైల్ ఫోన్ దొంగిలించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈఘటనపై బాధిత స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. స్నేహితురాలు తన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్లగా,ఆ సమయంలో డీఎస్పీ కల్పనా నగదు,ఫోన్ తీసుకెళ్లిందని తెలిపింది.

వివరాలు 

ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

స్నానం అయి బయటికి వచ్చేసరికి ఫోన్,నగదు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించింది. దానిలో డీఎస్పీ కల్పనా చేతుల్లో కరెన్సీ కట్టలు పట్టుకుని బయటికి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఆధారాలపై పోలీసు శాఖ డీఎస్పీ కల్పనా రఘువంశీపై చోరీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం.ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ను రికవర్ చేసినట్లు ఏఎస్పీ బిట్టూ శర్మ తెలిపారు.అయితే రెండు లక్షల రూపాయల నగదు మాత్రం ఇంకా దొరకలేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీసు హెడ్‌క్వార్టర్స్ కల్పనాకు నోటీసులు జారీ చేసి, శాఖా స్థాయిలో క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సీసీటీవీ ఫుటేజ్