
Obulapuram Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ప్రకటించింది.
సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం,దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిలో ఐదుగురిని దోషులుగా,ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది.
ఈకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి,బీవీ శ్రీనివాసరెడ్డి,మెఫజ్ అలీఖాన్,అలాగే గనుల శాఖలో అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌లను దోషులుగా కోర్టు నిర్ధారించింది.
గాలి జనార్దన్ రెడ్డి,బీవీ శ్రీనివాసరెడ్డికి న్యాయస్థానం ఏడేళ్లజైలు శిక్షను విధించింది.
అలాగే,ఇదే కేసులో అప్పట్లో గనులశాఖ మంత్రిగా పనిచేసిన సబితాఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది.
ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు లేవన్న కారణంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
అంతేకాకుండా,అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) May 6, 2025
Ex #Karnataka Minister Gali Janardhan Reddy convicted in the Obulapuram illegal mining case by CBI court in Hyderabad
- Probe began in 2009, charges framed under IPC & Prevention of Corruption Act
- Convicted along with PA Mefaz Ali Khan, ex-mines director V.D.… pic.twitter.com/hDKdPrDuTp