LOADING...
CBSE 2026 Final Time Table: సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల
సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల

CBSE 2026 Final Time Table: సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) ఆధీనంలోని పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ,12వ తరగతి బోర్డు పరీక్షల తుది టైమ్‌టేబుల్‌ను బోర్డు తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం, ఈ పరీక్షలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17, 2026 నుండి ప్రారంభమవుతాయి. 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఈ వివరాలను సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు. ఆయా తేదీల్లో పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించబడతాయి.

వివరాలు 

పరీక్షలకు 110 రోజుల ముందుగా తుది డేట్‌ షీట్‌లను విడుదల 

గత నెలలో, తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ డేటా ఆధారంగా సీబీఎస్ఈ తాత్కాలిక డేట్‌షీట్‌లను విడుదల చేసింది. అనంతరం పాఠశాలలు విద్యార్థుల జాబితాలను (List of Candidates - LOC) సమర్పించడంతో, వాటి ఆధారంగా బోర్డు తుది డేట్‌షీట్‌ను రూపొందించి ప్రకటించింది. సకాలంలో జాబితాలు అందడంతో తొలిసారి ఈ పరీక్షలకు 110 రోజుల ముందుగా తుది డేట్‌ షీట్‌లను విడుదల చేసింది. దీని ఫలితంగా విద్యార్థులకు తయారీకి మరింత సమయం దక్కింది. అంతేకాకుండా, ప్రతి రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఉండేలా టైమ్‌టేబుల్‌ రూపొందించబడింది, తద్వారా విద్యార్థులు సమర్థవంతంగా సన్నద్ధం కావచ్చు.

వివరాలు 

ప్రవేశ పరీక్షల మధ్య సమయాన్ని మెరుగ్గా వినియోగించుకోవడానికి అవకాశం

అలాగే, 12వ తరగతి విద్యార్థుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ టైమ్‌టేబుల్‌ను రూపొందించినట్లు బోర్డు వెల్లడించింది. ఈసారి బోర్డు పరీక్షలు అనేక ప్రవేశ పరీక్షల కంటే కొంత ముందుగానే ముగియనున్నాయి, అందువల్ల విద్యార్థులు బోర్డు పరీక్షల అనంతరం ప్రవేశ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల