Page Loader
Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు 
బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని సిసిబి పోలీసులు ఉద్యాననగర్‌లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో నిన్న అర్థరాత్రి వరకు జరిగిన రేవ్ పార్టీపై దాడి చేశారు. ఆ దాడిలో డ్రగ్స్ దొరికాయి. తెల్లవారుజామున 3 గంటలకు పార్టీపై దాడి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడి అనంతరం పార్టీ నిర్వాహకుడిని, ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బర్త్ డే పేరుతో ఈ పార్టీ జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పార్టీ ఏర్పాటు చేశారు. అయితే రాత్రి పొద్దుపోయినా పార్టీ ముగియలేదు. తెల్లవారుజాము వరకు పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ దాడి చేసినట్లు సమాచారం.

Details

రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి  కారు 

ఈ పార్టీలో కర్ణాటకలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నటీనటులు, మోడల్స్‌ పాల్గొన్నారని చెప్పారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.

Details

ఈ పార్టీ ఎవరిది, ఎవరు నిర్వహించారు?

ఈ ఫామ్‌హౌస్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీ యజమాని గోపాల్‌కు చెందినదని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌కు చెందిన వాసు పార్టీ నిర్వహించారు. పార్టీని భారీ స్థాయిలో నిర్వహించగా, పార్టీకి ధనవంతులు హాజరయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో వచ్చిన అతిథులు! ఈ పార్టీని నిర్వహించిన గోపాల్ వాసు తన పార్టీకి వచ్చే అతిథులను హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను బుక్ చేశాడు. వారందరినీ విమానాల ద్వారా బెంగళూరుకు తీసుకొచ్చారు. బెంగళూరులో దిగిన తర్వాత ఆడి, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ సహా 15కు పైగా లగ్జరీ కార్లను పార్టీ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు వినియోగించినట్లు తెలిసింది.