Page Loader
CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా

CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 11, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్‌ తేదీలో మార్పులు చేర్పులు చేసింది. నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ తేదీని నవంబర్‌ 25కి మారుస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 9న తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 23న దేవ్ ఉథాని ఏకాదశి సందర్భంగా ఆ రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. దీంతో పోలింగ్‌ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి సూచనలు అందాయి. ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చిన ఈసీ, తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవ్ ఉథాని ఏకాదశి కారణంగా పోలింగ్ డేట్ మార్పు